News March 22, 2024
తప్పుడు ఆరోపణలపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు: సజ్జల

AP: విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘డ్రగ్స్ దిగుమతి కచ్చితంగా టీడీపీ గ్యాంగ్ పనే అని మాకు అనుమానం ఉంది. ఆ పార్టీ నాయకులకే నిందితులతో సంబంధాలున్నాయి. ఈ కేసులో ఎవరున్నారో తెలియాల్సిందే. తప్పించుకోవడానికి మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News November 17, 2025
న్యూస్ రౌండప్

⋆ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
⋆ నేడు మ.3 గంటలకు TG క్యాబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలు, అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
⋆ నేడు T BJP నేతల కీలక భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ
⋆ లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో నేడు CBI విచారణకు పుట్ట మధు
News November 17, 2025
నువ్వుల పంట కోతకు వచ్చిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.


