News September 27, 2024
డీజే శబ్ధాలపై ఫిర్యాదులు.. సీపీ కీలక సమావేశం

TG: మతపరమైన ర్యాలీల్లో డీజేలు, బాణసంచా వినియోగంపై HYD కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. పలు పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతలు భేటీకి హాజరయ్యారు. DJ శబ్ధాల వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని కంట్రోల్ చేయలేకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. దీనిపై అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు.
Similar News
News November 1, 2025
అక్షతలు తలపైన వేసుకుంటే…

శాస్త్రం ప్రకారం.. అక్షతలు శుభాన్ని సూచిస్తాయి. అందుకే శుభ కార్యాల్లో, పండుగలప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అక్షతలను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలో వాడిన అక్షతలను దాచుకుని, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాటిని తలపైన వేసుకోవాలట. ఇలా చేస్తే చేయాలనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం.
News November 1, 2025
ఓల్డ్ గూగుల్ క్రోమ్ వాడుతున్నారా?

ఓల్డ్ వెర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని CERT-In హెచ్చరికలు జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని, దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని తెలిపింది. లైనక్స్, విండోస్, macOSలో 142.0.7444.59/60 కంటే ముందున్న వెర్షన్లు వాడుతుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 1, 2025
85% మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర

TG: మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఇప్పటివరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి.


