News October 16, 2024

ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: ఉచిత ఇసుక అంశంలో ఫిర్యాదులు రావడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించేందుకే ఎల్లుండి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని క్యాబినెట్ భేటీలో తెలిపారు. ఇసుక అంశంలో MLAల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తామన్నారు. లబ్ధిదారులపై రవాణా ఛార్జీలు తప్ప ఇతర ఛార్జీలు పడకూడదని, ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయొద్దన్నారు. అక్రమాలు జరగకుండా ఇన్‌ఛార్జ్ మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 16, 2024

8113 ఉద్యోగాలు.. మరో నాలుగు రోజులే గడువు

image

రైల్వేలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, టైపిస్ట్, క్లర్క్ పోస్టుల్లో ఖాళీలున్నాయి. 18 నుంచి 36 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఈ నెల 20 తేదీలోపు అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. సికింద్రాబాద్ రీజియన్లో-478 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసేందుకు ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి.

News October 16, 2024

శ్రీవారి భక్తులకు శుభవార్త

image

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్‌‌ తేదీలను TTD వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు ఈ నెల 24వ తేదీ ఉ.10 గంటల నుంచి TTD వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 19 నుంచి 21 వరకు ఆర్జిత సేవా టికెట్లు, 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల కానున్నాయి. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.

News October 16, 2024

అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్: CM

image

AP: 6 కొత్త <<14373945>>పాలసీలు <<>>రాష్ట్ర ప్రగతిని మారుస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఐదు జోన్లలో 5 ఇన్నోవేషన్ రతన్‌టాటా హబ్‌లు వస్తాయని, అమరావతి కేంద్రంగా విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ/గుంటూరు, తిరుపతి, అనంతపురంలో హబ్‌లు వస్తాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ ఇన్నోవేషన్ హబ్‌గా మారాలనేది తమ టార్గెట్ అని బాబు చెప్పారు.