News April 10, 2025

YS జగన్‌పై ఫిర్యాదులు

image

AP: టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసుల బట్టలూడదీసి నిలబెడతానంటూ YCP అధినేత, మాజీ సీఎం YS జగన్ చేసిన <<16030703>>వ్యాఖ్యలపై <<>> తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన జగన్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ నేతలు విశాఖ గాజువాక పీఎస్‌తో పాటు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

Similar News

News November 28, 2025

డ్రెస్సునో, లిప్‌స్టిక్‌నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

image

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్‌స్టిక్‌నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.

News November 28, 2025

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలి: CBN

image

AP: TDP పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం చంద్రబాబు ఎంపీలకు కీలక సూచనలు చేశారు. DEC 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలే ఎజెండాగా తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అంశాలను ప్రస్తావించాలని MPలకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలని, రైతు సమస్యల పరిష్కారం ముఖ్యమని CBN వివరించారు.

News November 28, 2025

అక్కడ మూడో తరగతి వరకు నో ఎగ్జామ్స్

image

జపాన్‌లోని విద్యా వ్యవస్థ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అక్కడ మూడో తరగతి వరకూ హోమ్‌వర్క్స్, ఎగ్జామ్స్, ర్యాంకులంటూ ఉండవు. నాలుగో తరగతి నుంచి అకడమిక్ వర్క్ మొదలవుతుంది. అక్కడ తొలి మూడేళ్లు వారికి బ్యాగ్‌ ప్యాక్ చేసుకోవడం, క్లాస్ రూమ్‌ను క్లీన్‌గా ఉంచుకోవడం, ఇతరులకు హెల్ప్ చేయడం వంటివి నేర్పుతారు. అదే ఇండియాలో నర్సరీ నుంచే పిల్లలు హోంవర్క్, పరీక్షలు, ర్యాంకుల ఒత్తిడిని ఎదుర్కొంటారు.