News December 25, 2024

ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదు.. హైకోర్టులో అంబటి పిటిషన్

image

AP: వైఎస్ జగన్‌తో పాటు తన కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు తనకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ రేపు/ఎల్లుండి విచారణకు రానుంది. పార్టీ ఇన్‌పర్సన్‌గా రాంబాబు స్వయంగా వాదనలు వినిపించనున్నారు.

Similar News

News December 25, 2024

వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు: TTD

image

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్ని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. వచ్చే నెల 8న ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేకంగా టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.

News December 25, 2024

జానీ మాస్టర్‌కు మరో షాక్

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు అందులో పేర్కొన్నారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెను వేధించినట్లు నిర్ధారించారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్నారు.

News December 25, 2024

తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ అభినందనలు

image

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘మనం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం’ అని పొన్నం ప్రభాకర్ పేరిట ఆయన లెటర్ రాశారు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఇలానే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.