News March 25, 2024
ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్ విడుదల కాగా.. తాజాగా మిగతా షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 21న క్వాలిఫయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి
Similar News
News April 13, 2026
భవిష్యత్‌లో 80కోట్ల మందికి నో జాబ్స్: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్

రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సంక్షోభం తలెత్తవచ్చని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా హెచ్చరించారు. ‘యుద్ధం లాంటి సమస్యలు ముగిసినా అసలైన సవాలు నిరుద్యోగమే. వచ్చే 10-15yrsలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 120Cr మంది పనిచేసే వయసుకు వస్తారు. కేవలం 40Cr ఉద్యోగాలు సృష్టించబడతాయి. 80Cr మందికి జాబ్స్ దొరక్కపోవచ్చు. దేశాలు వ్యవసాయం, తయారీ, పర్యాటక రంగాలపై దృష్టిపెట్టాలి’ అని సూచించారు.
News April 13, 2026
హార్దిక్ కెప్టెన్సీపై అశ్విన్ విమర్శలు

IPL:నిన్న ఆర్సీబీతో మ్యాచులో హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యారని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. స్పిన్నర్లపై విరుచుకుపడే రజత్ పాటీదార్ క్రీజులోకి రాగానే మయాంక్ మార్కండేకు బౌలింగ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మార్కండే రెండు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చాడని.. ఇదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని అభిప్రాయపడ్డారు. పాండ్య తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని అసంతృప్తి వ్యక్తం చేశారు.
News April 13, 2026
నెలసరి ఆలస్యం అవుతోందా?

నెలసరి తరచూ ముందుగా లేదా ఆలస్యం అవడానికి జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యలూ కారణం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘చిన్న విషయాలకే ఆందోళన చెందడం, డైటింగ్ పేరుతో ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది. మితిమీరిన వ్యాయామం, దీర్ఘకాల నిద్రలేమి, మెడిసిన్స్ ప్రభావం కూడా నెలసరిపై పడుతుంది. దీనిపై డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.


