News August 30, 2024

2026 మార్చి నాటికి దేవాదుల పూర్తి: ఉత్తమ్

image

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాకు కీలకమైన దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ‘ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది మా లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నాశనం చేసింది. దేవాదుల నుంచి 300 రోజులు 60 టీఎంసీలు ఎత్తిపోశాం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం’ అని ఆయన చెప్పారు.

Similar News

News January 7, 2026

ICC స్పందించిందన్న BCB.. భారత్‌లోనే బంగ్లా మ్యాచ్‌లు!

image

T20 వరల్డ్ కప్‌లో తమ ప్లేయర్ల భద్రత విషయంలో లేవనెత్తిన ఆందోళనలపై ICC స్పందించినట్లు బంగ్లా బోర్డు వెల్లడించింది. టోర్నీలో బంగ్లా టీమ్ పూర్తిస్థాయిలో పాల్గొనేలా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ICC చెప్పినట్లు తెలిపింది. ఆటగాళ్ల భద్రత విషయంలో BCB ఇన్‌పుట్స్ తీసుకొని తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో బంగ్లా మ్యాచ్‌లు భారత్‌లోనే కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది.

News January 7, 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఒడిశా కోరాపుట్ డివిజన్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (<>HAL<<>>) 3 Sr. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBBS+పీజీ/DNB/పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవంగల వారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

News January 7, 2026

₹46,750 కోట్ల వెనిజులా బంగారం స్విట్జర్లాండ్‌కు!

image

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో హయాంలో ఏకంగా $5.2 బిలియన్ల (దాదాపు ₹46,750 కోట్లు) విలువైన బంగారం స్విట్జర్లాండ్‌కు తరలిపోయింది. 2013 నుంచి 2016 మధ్య సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని రిఫైనింగ్ పేరుతో అక్కడికి పంపారు. దేశ ఆర్థిక సంక్షోభం సాకుతో ఈ అమ్మకాలు జరిగాయి. మదురో అరెస్ట్ కావడంతో స్విస్ బ్యాంకులు ఆయన ఆస్తులను స్తంభింపజేశాయి. అయితే ఈ గోల్డ్‌ తరలింపు వెనక గుట్టు ఏంటనే దానిపై క్లారిటీ లేదు.