News November 16, 2024
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కంప్లైంట్ బాక్స్‌లు పెట్టాలి: HC

TG: ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాలని హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. వినతులు, ఫిర్యాదులు వస్తే రిజిస్ట్రార్ లేదా ఆపై అధికారులు పరిశీలించి విచారణ చేపట్టాలని చెప్పింది. రంగారెడ్డి(D) జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.
Similar News
News December 8, 2025
3,131 ఉద్యోగాలు.. BIG UPDATE

SSC CHSL-2025 టైర్-1 ఆన్లైన్ పరీక్షల కీ విడుదలైంది. అభ్యర్థులు https://ssc.gov.in/లో రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్‌తో లాగినై కీ, రెస్పాన్స్‌షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి అభ్యంతరాలను తెలపవచ్చు. కాగా 3,131 ఉద్యోగాలకు నవంబర్ 12 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
News December 8, 2025
70-20-10.. ఇదే ప్రమోషన్ ఫార్ములా!

ప్రమోషన్ ఇవ్వడానికి 70-20-10 ఫార్ములాను కంపెనీలు ఫాలో అవుతాయి. 70% వర్క్ ఎక్స్పీరియన్స్, 20% మెంటార్షిప్, ఫీడ్‌బ్యాక్, కోచింగ్, 10% కోర్సులు, ట్రైనింగ్ ఆధారంగా ప్రమోషన్ ఇస్తాయి. ప్రాజెక్టులు డీల్ చేసిన విధానం, చిన్న టీమ్స్ లీడ్ చేయడం, తోటి ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్, ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ట్రైనింగ్, ఒత్తిడిని అధిగమించడం, క్లిష్ట సమయాల్లో ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని ప్రమోషన్లు ఇస్తాయి.
News December 8, 2025
TG గ్లోబల్ సమ్మిట్.. మంత్రులు ఏమన్నారంటే?

* ఫీనిక్స్ పక్షి మాదిరిగా వివిధ రంగాల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా TGని మారుస్తాం: శ్రీధర్ బాబు
* రాష్ట్రాన్ని ప్రపంచ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం: రాజనర్సింహ
* పర్యావరణం, ప్రజారోగ్యం, ఇంధన భద్రత కోసం క్లీన్ మొబిలిటీకి ప్రాధాన్యం: పొన్నం
* పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తాం: జూపల్లి
* 2047నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 90శాతానికి పెంచడమే లక్ష్యం: సీతక్క


