News November 11, 2024
కాలుష్య నియంత్రణకు త్వరలోనే సమగ్ర విధానం: CM

హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
Similar News
News December 3, 2025
రాజ్నాథ్ ఆరోపణలన్నీ నిరాధారాలే: కాంగ్రెస్

మాజీ ప్రధాని నెహ్రూపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ నిరాధార ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చెప్పారు. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి ప్రజాధనం వినియోగించడానికి నిరాకరించిన నెహ్రూ, బాబ్రీ నిర్మాణానికి పన్నుల ద్వారా వచ్చిన నిధులు కేటాయించాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. మాస్క్లు, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలకు ప్రజాధనాన్ని వినియోగించకూడదని నెహ్రూ భావించేవారని ఠాగూర్ తెలిపారు.
News December 3, 2025
ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేశారు.
News December 3, 2025
విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: CBN

AP: విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని CM చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ సేవలు ప్రారంభించామని చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని తూ.గో జిల్లా నల్లజర్లలో జరిగిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో తెలిపారు.


