News November 5, 2024
రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని సమాచారం. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లు చేసింది.
Similar News
News November 5, 2024
రాష్ట్రంలో ఘోరం.. మహిళపై గ్యాంగ్ రేప్
TG: HYD మధురానగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్‌లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్‌లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
News November 5, 2024
Wikiకి కేంద్రం నోటీసులు
అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్‌గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్‌ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్‌తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.
News November 5, 2024
దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
AP: ఓ విలేకరి హత్య కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తుని నియోజకవర్గం తొండంగికి చెందిన విలేకరి సత్యనారాయణ 2019 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు. దీనికి సూత్రధారి దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రాజా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.