News March 18, 2025
సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్లో నియమిస్తారు.
Similar News
News November 14, 2025
బిహార్ ఫలితాలను ప్రభావితం చేసేవి ఇవే!

ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఫలితాలపై దేశమంతా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ NDAకే అనుకూలంగా ఉన్నా కింది అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
* ప్రాంతాల వారీగా పార్టీల ఆధిపత్యం
* కొత్త పార్టీల పోటీతో ఓట్లు చీలే అవకాశం
* స్థానికత, కుల సమీకరణాలు
* ఓటింగ్ పెరగడం.. పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లే అధికం
* అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు
News November 14, 2025
ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన BBC

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రముఖ మీడియా సంస్థ <<18245964>>BBC<<>> ఆయనకు క్షమాపణలు చెప్పింది. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొంది. అయితే పరువునష్టం చెల్లించాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించింది. తాము ఉద్దేశపూర్వకంగా వీడియో ఎడిట్ చేయలేదని స్పష్టం చేసింది. ట్రంప్ డాక్యుమెంటరీని తిరిగి ప్రసారం చేసే ఉద్దేశం తమకు లేదని బీబీసీ న్యాయవాది తెలిపారు.
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: ఉదయం 8 గంటలకు కౌంటింగ్..

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉ.8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు ఫలితాలను EC వైబ్సెట్లో అప్డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో రౌండ్‌కు 45 నిమిషాలు పట్టనుంది.


