News August 7, 2024
వినేశ్ అనర్హతపై పార్లమెంట్లో ఆందోళన

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో పార్లమెంట్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ విషయంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో క్రీడాశాఖ మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. కాగా ఇంతకుముందే వినేశ్ ఫొగట్‌పై కాంగ్రెస్ ఓ వీడియో విడుదల చేసింది. ‘అప్పుడు ఢిల్లీ వీధుల్లో పోరాడారు. ఇప్పుడు రెజ్లింగ్ మ్యాట్‌పై పోరాడుతున్నారు’ అంటూ ప్రశంసించింది.
Similar News
News October 26, 2025
25 ప్రైవేట్ బస్సులకు భారీగా జరిమానా: RTO

కర్నూలు(D) జిల్లా బస్సు దుర్ఘటన నేపథ్యంలో శనివారం రాత్రి తిరుపతి జిల్లా వ్యాప్తంగా RTA అధికారులు తనిఖీలు చేపట్టారు. RTO మురళీమోహన్ నిబంధనలు పాటించని 25 బస్సులపై కేసులు నమోదు చేశారు. అగ్ని మాపక నియంత్రణ పరికరాలు లేనివి 5, సరుకు రవాణా చేస్తున్న వాహనాలు 6, అనధికార సీటింగ్ మార్పిడిపై కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం రూ.3లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
News October 26, 2025
ప్రైవేట్ ట్రావెల్స్ వద్దు బాబోయ్!

కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులంటేనే వణికిపోతున్నారు. ఆలస్యమైనా ఫర్వాలేదు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య సుమారు 250 కి.మీ దూరం ఉంటే ప్రైవేట్ బస్సులు 3 గంటల్లోనే వెళ్తాయి. దీన్ని బట్టి అవి ఎంత వేగంగా దూసుకెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ స్పీడ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
News October 26, 2025
కార్తీకంలో ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం|
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే||
‘ఓ దామోదరా, అన్ని పాపాలను పోగొట్టే పుణ్యమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు నమస్కారం అని’ అని ఈ శ్లోక అర్థం. కార్తీక మాసంలో ఈ శ్లోకం పఠించి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నాయి.


