News April 5, 2024
పోలవరం, గోపాలపురం టికెట్లపై టీడీపీ శ్రేణుల ఆందోళన

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా) పర్యటనలో గందరగోళం ఏర్పడింది. పోలవరం, గోపాలపురం అసంతృప్త నేతలు, కార్యకర్తలు CBN కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. జనసేన నేత చిర్రి బాలరాజుకు పోలవరం టికెట్ ఇవ్వొద్దని బొరగం శ్రీనివాస్(TDP) వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గోపాలపురంలో మద్దిరాజు వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బాపిరాజు వర్గీయులు నినాదాలు చేశారు.
Similar News
News December 2, 2025
రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.
News December 2, 2025
శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు <<18427442>>భారత్ సాయం<<>> అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘క్లిష్ట సమయంలో SLకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నట్లుగానే ఇప్పుడూ మద్దతునిస్తున్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.
News December 2, 2025
దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

దిత్వా తుఫాన్ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.


