News May 12, 2024

రోహిత్ శర్మ ఆటపై ఆందోళన

image

పొట్టి ప్రపంచ కప్ ముంగిట భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్‌లో తొలి అర్ధభాగంలో సెంచరీతో సహా భారీగా పరుగులు చేసిన శర్మ, సెకండాఫ్‌లో తేలిపోయారు. నిన్న కేకేఆర్ జరిగిన మ్యాచ్‌లో సైతం 24 బంతులాడి 19 రన్స్ చేశారు. దీంతో రోహిత్ ఇలా ఆడుతున్నారేంటంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమవుతున్నారంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు.

Similar News

News December 29, 2024

అంతటా బుమ్రానే..

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్‌ను ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు ఆకట్టుకుంటోంది. ‘కంగారూలు దూకగలవు కానీ బుమ్రా నుంచి దూరంగా పారిపోలేవు’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ అంతటా బుమ్రానే ఉన్నారని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా 29 వికెట్లు తీశారు.

News December 29, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ రూ.150, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ధరలు రూ.190, రూ.220గా ఉన్నాయి. మరోవైపు ఏపీలోని విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.220-230 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.

News December 29, 2024

అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!

image

TG: ఆదాయంలో మార్పు లేదు కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కూరగాయల నుంచి మాంసం వరకు అన్నీ భారమే. రాష్ట్రంలో కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తలకు మించిన భారంగా ఉంటోందని జాతీయ గృహ వినియోగ సర్వే తెలిపింది. ప్రతి నెలా నిత్యావసరాల నిమిత్తం రాష్ట్రంలోని కుటుంబాలకు రూ.5675 ఖర్చవుతోందని పేర్కొంది. నెలవారీ వ్యయంలో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.