News July 6, 2024

BRS MLAను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని ఆందోళన

image

TG: గద్వాల BRS MLA బండ్ల <<13568887>>కృష్ణమోహన్‌రెడ్డిని<<>> కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. ఆయనను చేర్చుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని రాష్ట్ర అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అయితే బండ్లను చేర్చుకోవడానికే పార్టీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు బండ్ల ఇప్పటికే ప్రకటించారు.

Similar News

News November 27, 2025

వేములవాడ ఆలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో కేవలం శానిటేషన్ విభాగం సిబ్బందికి మాత్రమే ఈ విధానం అమలులో ఉండగా, కొత్తగా ఆలయ సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు వేసుకునే పద్ధతిని ప్రారంభించారు. కాగా, ఆలయ ఈవో రమాదేవి బయోమెట్రిక్ హాజరు పనిచేస్తున్న తీరును గురువారం పరిశీలించారు.

News November 27, 2025

సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

image

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.

News November 27, 2025

భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

image

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.