News October 4, 2024
గ్రూప్-1పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

TG: గ్రూప్-1 పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెరిట్ జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే 7వేలకు పైగా అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే రిజల్ట్స్ ఇచ్చామని TGPSC కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 21న మెయిన్స్ ఉండటంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 19, 2026
నాకు పెళ్లి కాలేదు: డింపుల్ హయాతి

తనకు పెళ్లి అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ డింపుల్ హయాతి ఖండించారు. ‘ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది’ అని ఓ నెటిజన్ SMలో కామెంట్ చేయగా ‘నాకు పెళ్లి కాలేదు’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. డింపుల్, ఆమె భర్త డేవిడ్‌పై పోలీస్ కేసు నమోదైందంటూ సదరు నెటిజన్ ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేయగా అది ఫేక్ అని ఆమె బదులిచ్చారు. కాగా డింపుల్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది.
News January 19, 2026
2030 కల్లా అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్: SBI

భారత్ ఆర్థికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని SBI తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2028 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది. 2030నాటికి ‘అప్పర్ మిడిల్ ఇన్కమ్’ దేశాల క్లబ్లో చేరనుందని పేర్కొంది. అప్పటికీ మన తలసరి ఆదాయం $4,000 (దాదాపు రూ.3,63,541) మార్కును తాకడం ఖాయమని అంచనావేసింది. 2047నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలవనుందని తెలిపింది.
News January 19, 2026
‘దండోరా’పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమాపై హీరో Jr NTR ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా గాఢమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. నటీనటులందరి ప్రదర్శన అద్భుతమని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా JAN 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


