News November 1, 2024
హిందువులపై దాడిని ఖండిస్తున్నా: ట్రంప్
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్లు విస్మరించారని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 1, 2024
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి తెలుసా?
తెలుగు మాట్లాడే రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. పొట్టి శ్రీరాములు దీక్ష, ప్రాణత్యాగంతో 1953 OCT 1న ఆంధ్రరాష్ట్రం అవతరించింది. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొందరు దీన్ని వ్యతిరేకించినప్పటికీ విస్తృత చర్చల తర్వాత ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ (తెలంగాణ) కలయికతో 1956 NOV 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. 2014లో మళ్లీ ఏపీ, తెలంగాణ విడిపోయాయి.
News November 1, 2024
ఆపద్బాంధవుడవయ్యా ముకేశ్!
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా-ఏ కేవలం 107 రన్స్కే ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించి గెలవడం పక్కా అనే దశలో భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆపద్బాంధవుడయ్యారు. 46 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముకేశ్ రాణింపుతో భారీ లీడ్ తప్పింది.
News November 1, 2024
IPL: ఈ ప్లేయర్లకు భారీ జాక్పాట్
IPL-2025 రిటెన్షన్లో పలువురు ప్లేయర్లు జాక్పాట్ కొట్టేశారు. RR వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్కు 2024లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే దక్కగా ఈసారి రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. అంటే ఏకంగా 6900% అధికం. పతిరణ (రూ.13 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.50 కోట్లు), శశాంక్ సింగ్ (రూ.5.50 కోట్లు), రింకూ సింగ్ (రూ.13 కోట్లు)లు ఈ లిస్టులో ఉన్నారు.