News July 31, 2024
ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఉప రాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. నూతన క్రిమినల్ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సేంద్రియ వ్యవసాయం, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తదితర అంశాలపై చర్చిస్తారు.
Similar News
News December 4, 2025
వీధికుక్కలు వెంబడిస్తే ఇలా చేయకండి!

బైకర్లను వీధికుక్కలు వెంబడించి భయపెట్టడం తెలిసిందే. ఈ సమయంలో కొందరు వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి గురవుతుంటారు. నిన్న వరంగల్(D) మచ్చాపూర్లో కుక్కల భయానికి ఓ వ్యక్తి బైక్ను వేగంగా నడుపుతూ అదుపుతప్పి డ్రైనేజీలో పడి చనిపోయాడు. కుక్కలు వెంబడిస్తే బైక్ను వేగంగా నడపొద్దు. గట్టిగా అరిస్తే అవి మరింత రెచ్చిపోతాయి. రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవి సైలెంట్ అవుతాయి. వాటి కళ్లలోకి నేరుగా చూడకండి.
News December 4, 2025
సిరి ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో లాభం

చిరు ధాన్యాల సాగు, వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలే దీనికి కారణం. చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ని, BP, షుగర్, గుండె వ్యాధుల ముప్పును తగ్గించి రక్తహీనతను దూరం చేస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు తొందరగా అలసిపోకుండా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి.
News December 4, 2025
SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.


