News September 8, 2025

భారత్ పొరుగు దేశాల్లో గొడవలు.. ప్రభుత్వాల మార్పు

image

2021 మయన్మార్: ఎన్నికైన ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు. ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు
2022 శ్రీలంక: అప్పులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఆందోళనలు. ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స రాజీనామా
2024 బంగ్లాదేశ్: షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. హసీనా రాజీనామాతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
>తాజాగా నేపాల్‌లో యువత ఆందోళన.. హోంమంత్రి రాజీనామా

Similar News

News September 9, 2025

EHS పాలసీ విధి విధానాలు త్వరలో ఖరారు: సీఎస్

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కవర్ అయ్యేలా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) విధానాన్ని రూపొందించాలని అధికారులను CS కె.రామకృష్ణారావు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నమూనాలను, బీమా కంపెనీ పాలసీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలన్నారు. దీని ద్వారా 7,14,322 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారని, ఏడాదికి సుమారు ₹1,300Cr ఖర్చవుతుందని అంచనా వేశారు.

News September 9, 2025

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

image

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటితో పాటు కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ వంటి పానీయాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘కొబ్బరి నీళ్లలోని పొటాషియం, ఎలక్ట్రోలైట్లు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. బార్లీ వాటర్ కిడ్నీ స్టోన్స్‌ను నివారిస్తుంది. గ్రీన్ టీ, క్రాన్బెర్రీ జ్యూస్ కిడ్నీలకు మేలు చేస్తాయి’ అని చెబుతున్నారు.

News September 9, 2025

పాక్‌ను తేలికగా తీసుకోం: భారత బౌలింగ్ కోచ్

image

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను తేలికగా తీసుకోబోమని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. పాక్‌తో సవాలు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని, ఆ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తమ నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్/బౌలింగ్ చేసేలా ఆల్‌రౌండర్లకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా భారత్, పాక్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది.