News June 3, 2024

నోటా ఓటుతో కలవరపాటు!

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నోటా ఓట్లు కూడా అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే.. గత రెండు ఎన్నికల్లోనూ నోటా ఓట్లు భారీగానే పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,02,942 మంది, 2019లో 65,22,772 మంది నోటా బటన్ నొక్కేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ ఓట్లు అభ్యర్థులకు పడితే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉండేది.

Similar News

News October 19, 2025

గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే?

image

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో 5 రోజుల్లోపు తీసుకోవచ్చంటున్నారు. అయితే దీన్ని అబార్షన్ ప్రేరేపితంగా ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ మాత్ర వల్ల మైగ్రేన్, అలసట, వాంతులు, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు.
* ఉమెన్ రిలేటెడ్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 19, 2025

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

ముంబై పోర్ట్ అథారిటీ 5 హిందీ ట్రాన్స్‌లేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. డిగ్రీ (హిందీ, ఇంగ్లిష్ ఎలక్టివ్ సబ్జెక్ట్ కలిగినవారు) ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/

News October 19, 2025

హర్షిత్ రాణాపై తీవ్ర ఒత్తిడి!

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుండగా, తుది జట్టులో స్థానం దక్కితే హర్షిత్ రాణాపై తీవ్ర ఒత్తిడి ఉండే ఛాన్స్ ఉంది. కోచ్ గంభీర్‌కు క్లోజ్ అవడం వల్లే రాణా జట్టులో ఉన్నారని, AUS సిరీస్‌కు ఎందుకు సెలక్ట్ చేశారో అర్థం కాలేదని పలువురు మాజీలు ఇప్పటికే పెదవి విరిచారు. దీనిపై <<18002234>>గంభీర్<<>> కూడా ఘాటుగానే స్పందించారు. ఈ క్రమంలో ప్లేయింగ్ 11కి ఎంపికైతే రాణా ఏ మేరకు రాణిస్తారో చూడాలి. దీనిపై మీ COMMENT.