News August 25, 2024

తిరుమలలో రద్దీ.. వెంకన్న దర్శనానికి 24 గంటలు

image

AP: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 79,251 మంది వెంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.87 కోట్ల ఆదాయం వచ్చింది.

Similar News

News December 2, 2025

ఫోన్లలో Govt యాప్.. నిఘా కోసమేనా?

image

ఫోన్లలో ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ యాప్‌ <<18439451>>డిఫాల్ట్‌గా<<>> ఉండాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లోనే డిలీట్ చేసేందుకు వీలులేని ఇలాంటి యాప్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నార్త్ కొరియాలా తమపై నిఘా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?

News December 2, 2025

విష్ణు నామాల్లోనే ఆయన గొప్పతనం

image

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః|
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థివిరో ధ్రువః||
కొలవలేనంత గొప్పతనం కలిగిన అప్రమేయుడు, మనస్సుకు అధిపతి అయిన హృషీకేశుడు, దేవతలకు రాజైన సురప్రభువు, సృష్టిని నిర్మించిన విశ్వకర్మ, మన పాలకుడైన మనువు, రూపాలను తీర్చిదిద్దే త్వష్టా, అతి స్థిరమైన స్థవిష్ఠుడు, ధ్రువుడు, అతి పెద్దవాడైన స్థవిరుడు, నాభి నుంచి పద్మం కలిగిన పద్మనాభుడు ఆ విష్ణుమూర్తే. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 2, 2025

హిల్ట్ పాలసీపై BRS పోరు బాట

image

TG: <<18440700>>హిల్ట్<<>> పాలసీతో ప్రజలకు నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీని కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు. HYD చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి రేపు, ఎల్లుండి ఆ ప్రాంతాల్లో ఈ టీమ్స్ పర్యటించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.