News March 16, 2025
Congratulations: ముంబైదే WPL ట్రోఫీ

ఉత్కంఠ పోరులో WPL టైటిల్ను ముంబై గెలిచింది. 8 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి మూడేళ్ల లీగ్ చరిత్రలో రెండోసారి కప్ అందుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది. నికీ ప్రసాద్ (25*)పోరాడినా ఫలితం లేకపోయింది. కాప్ 40 పరుగులతో రాణించారు. బ్రంట్ 3 వికెట్లతో సత్తా చాటారు. 2023లోనూ ముంబై కప్ గెలిచిన విషయం తెలిసిందే.
Similar News
News March 16, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం బ్రేక్

AP: కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని (35వేల క్యూసెక్కులు) తరలించేలా ఈ ఎత్తిపోతల పథకం చేపట్టారు. అనుమతులు నిరాకరించడంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు.
News March 16, 2025
GOOD NEWS: వారికి ఉచితంగా బస్సు

AP: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్తో వచ్చే నెల 1వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.
News March 16, 2025
WPL-2025 అవార్డ్స్ విజేతలు వీరే

☛ ఆరెంజ్ క్యాప్ – నటాలీ స్కివర్ బ్రంట్ (523 రన్స్, ముంబై ఇండియన్స్)
☛ పర్పుల్ క్యాప్ – అమేలియా కెర్ (18 వికెట్స్, ముంబై ఇండియన్స్)
☛ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – అమంజోత్ కౌర్ (ముంబై ఇండియన్స్)
☛ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – నటాలీ స్కివర్ బ్రంట్ (1523 PTS)
☛ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – హర్మన్ప్రీత్ కౌర్ (66 రన్స్)