News April 12, 2024
అబ్బాయికి బాబాయ్ అభినందనలు

రామ్ చరణ్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. డాక్టరేట్ స్ఫూర్తితో చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేసి మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కళారంగానికి చేసిన సేవలకు గానూ చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 17, 2026
సీఎం హార్వర్డ్ కోర్సుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించింది: KTR

TG: సీఎం రేవంత్ <<18999625>>హార్వర్డ్<<>> కోర్సు ఫీజులు, విమాన ఖర్చులు ప్రభుత్వమే చెల్లించిందని అసెంబ్లీలో KTR ఆరోపించారు. ‘RTI ద్వారా వివరాలు తెలుసుకున్నాం. సర్కార్ విద్యాశాఖ మంత్రి(రేవంత్) ఫీజులు కడుతుంది కానీ రాష్ట్రంలోని విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించదా? గురుకులాల్లో నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది. యూనివర్సిటీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది’ అని మండిపడ్డారు.
News March 17, 2026
20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.
News March 17, 2026
పాక్ దాడి పిరికిపంద చర్య: భారత్

అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై <<19403539>>పాకిస్థాన్ దాడిని<<>> భారత్ ఖండించింది. రంజాన్ వేళ ఇలా చేయడం దారుణమని మండిపడింది. దీన్ని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇది మిలిటరీ దాడి కాదు మారణహోమమని పేర్కొంది. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కాగా పాక్ దాడిలో దాదాపు 400 మంది అమాయకులు మరణించారు.


