News March 9, 2025
భారత జట్టుకు అభినందనల వెల్లువ

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి తన సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Similar News
News March 10, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in
News March 10, 2025
PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.
News March 10, 2025
అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా: అద్దంకి

TG: పార్టీ తనను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అధిష్ఠానం ఏ బాధ్యత ఇచ్చిన సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. అందుకే తన పేరును ప్రకటించారని పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేయని సంగతి తెలిసిందే.