News June 7, 2024

కాంగ్రెస్: 3 ఎన్నికల్లో 195.. బీజేపీ: 2024లోనే 240

image

2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. 2014 నుంచి ఇప్పటివరకు 3 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన మొత్తం సీట్ల కంటే 2024లో బీజేపీ సాధించిన సీట్లు ఎక్కువ కావడం గమనార్హం. హస్తం పార్టీ 2014లో 44, 2019లో 52, 2024లో 99 సీట్లు.. అంటే మొత్తం 195 స్థానాల్లో గెలిచింది. అయితే 2024 ఎన్నికల్లోనే బీజేపీ 240 సీట్లు సాధించింది.

Similar News

News September 12, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ ప.గో, ఏలూరు, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, KNL, నంద్యాల, ATP, కడప, TPT జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. అటు TGలో NML, NZB, HYD, మేడ్చల్, MBNR, NGKL, NRPT, వనపర్తి, మహబూబాబాద్, SRPT, JGL, SRCL, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్, NLG జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

News September 12, 2025

కాకినాడ మత్స్యకారులు విడుదల

image

AP: కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్‌ నావిగేషన్ తప్పుగా చూపించడంతో ఈ నలుగురు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో శ్రీలంక కోస్ట్‌ గార్డ్ వీరిని అదుపులోకి తీసుకుంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నలుగురిని విడుదల చేసింది. దీంతో జాలర్లు మరో 2 రోజుల్లో సముద్రమార్గం ద్వారా కాకినాడకు చేరుకోనున్నారు.

News September 12, 2025

తేజా సజ్జ ‘మిరాయ్’ పబ్లిక్ టాక్

image

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’లో తేజా సజ్జ, మంచు మనోజ్ నటనతో మెప్పించారని ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ SMలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కథా నేపథ్యం, విజువల్స్, BGM ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. కొన్ని సీన్లు గతంలో చూసిన మాదిరిగా అనిపిస్తాయని, క్లైమాక్స్ మెరుగ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.