News August 27, 2024

J&Kలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

image

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తొలి విడతలో 9 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌తో హస్తం పార్టీ కూటమిగా బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. NC 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 90 స్థానాలకు SEP 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడతలో పోలింగ్ జరగనుంది.

Similar News

News January 27, 2026

పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

image

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.

News January 27, 2026

మేడారం జాతరకు సెలవులు ఇవ్వాలని డిమాండ్లు

image

TG: రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతర నేపథ్యంలో హాలిడేస్ ప్రకటించాలని పేరెంట్స్ అంటున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇవాళో, రేపో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

News January 27, 2026

పాపాలను పోగొట్టే తిరుమల తీర్థం.. మీరు వెళ్తున్నారా?

image

తిరుమల కొండల్లోని పవిత్ర రామకృష్ణ తీర్థానికి వెళ్లే అద్భుత అవకాశాన్ని TTD కల్పిస్తోంది. ఏడాదికి ఒక్కసారి(మాఘ పౌర్ణమి) మాత్రమే ఇక్కడికి వెళ్లే అనుమతి ఉంటుంది. ఆ పుణ్య ఘడియలు ఈ ఏడాది FEB 1న రాబోతున్నాయి. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం. మహావిష్ణువు రామకృష్ణుడనే సాధువుకు ముక్తినిచ్చిన పుణ్య ప్రదేశమిది. ఎలా వెళ్లాలో పూర్తి వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.