News July 6, 2024

కాంగ్రెస్, బీజేపీ సంబంధం మళ్లీ బయటపడింది: BRS

image

TG: CM రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత అమిత్ షాపై పాతబస్తీలో నమోదైన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసును ఉపసంహరించుకున్నారని BRS ట్వీట్ చేసింది. దీని ద్వారా కాంగ్రెస్, BJP మధ్య ఉన్న అక్రమ సంబంధం మళ్లీ బయటపడిందని పేర్కొంది. ‘మొన్న సింగరేణి బొగ్గు గనుల వేలంకు BJPకి మద్దతు తెలపడం. ఇప్పుడు కేసు కొట్టివేయడం.. ఇలా కాంగ్రెస్, BJP పరస్పర సహకారంతో ప్రజలను మోసం చేస్తున్నాయి’ అని ఆరోపించింది.

Similar News

News March 3, 2026

హైదరాబాద్‌లో ‘ఖొమేనీ’ రోడ్డు ఉందా?

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ మృతితో ఆయన పేరు మార్మోగుతోంది. HYDలోనూ ‘ఖొమేనీ’ పేరిట రోడ్డు ఉందనే విషయం తెరపైకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్ నం.7ను ‘ఇమామ్ ఖొమేనీ రోడ్’ అని పిలుస్తారు. కానీ ఇది అలీ ఖమేనీ పేరిట పెట్టింది కాదు. ఇరాన్ తొలి సుప్రీం లీడర్ జ్ఞాపకార్థం పెట్టారు. ఇదే ప్రాంతంలో ఇరాన్ కాన్సులేట్ ఉండటం, కుతుబ్‌ షాహీల కాలంలో ఇరాన్‌తో సంబంధాల నేపథ్యంలో ఈ పేరు పెట్టినట్లు సమాచారం.

News March 3, 2026

‘హార్ముజ్’ బంద్.. మనకు ఆయిల్ ఎలా..?

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19288027>>మూసేయడం<<>> తెలిసిందే. దీంతో దిగుమతులకు అంతరాయం కలిగితే మనపై పడే ప్రభావం గురించి చర్చ జరుగుతోంది. ఇండియా రోజూ 5 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకుంటుండగా, ఈ జలసంధి గుండా 2.5MB వస్తోంది. ప్రస్తుతం మన వద్ద 40-45 రోజులకు సరిపడా స్టాక్ ఉన్నట్లు ‘Kpler’ చెప్పింది. స్టోరేజీ ట్యాంకులు, రిజర్వులు, దేశం వైపు వచ్చే నౌకల్లో 100 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ నిల్వ ఉన్నట్లు తెలిపింది.

News March 3, 2026

మా బాడీని జూమ్ చేసి వీడియోలు తీయకండి: హీరోయిన్

image

నటీమణులను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీయడంపై ‘కాంతార’ నటి సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కళాకారులను అభ్యంతరకర యాంగిల్స్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు. ఫీమేల్ యాక్టర్స్ శరీర భాగాలను జూమ్ చేసి ఫొటోలు తీస్తూ వాటిని SMలో పోస్ట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి పనులు మానుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని ఆమె డిమాండ్ చేశారు.