News October 3, 2024
కాంగ్రెస్ కొంపముంచిన ‘కొండా’ వ్యాఖ్యలు!

TG: KTRపై ఆరోపణలు చేసే క్రమంలో సమంత, అక్కినేని కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత <<14254371>>వ్యాఖ్యలు<<>> తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతోపాటు ప్రజలు, రాజకీయ పక్షాలు ఆమె తీరును ఖండించాయి. ఇప్పటికే ‘హైడ్రా’తో GHMC పరిధిలో పేదల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి సురేఖ వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ కలిగించాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
Similar News
News January 19, 2026
ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

గ్రీన్లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.
News January 19, 2026
అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.
News January 19, 2026
ఐఐటీ ఢిల్లీలో పోస్టులు

<


