News April 5, 2025
కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మజ్లిస్ హస్తగతం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే అని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ పదవిని మజ్లిస్ పార్టీకి ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, BRS తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. ఎంఐఎంకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News April 6, 2025
PBKS VS RR.. గెలుపెవరిదంటే?

PBKSతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా(62), మ్యాక్స్‌వెల్(30) మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్లో PBKSకు ఇదే తొలి ఓటమి.
News April 6, 2025
ఒకే ఒక్కడు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

PAK బౌలర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్ర సృష్టించారు. వరుసగా 2 వన్డేల్లో 12వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. NZతో జరిగిన రెండో ODIలో హారిస్ రౌఫ్ హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా నసీమ్ వచ్చారు. దీంతో ముఖీమ్ 12వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగారు. మూడో ODIలో ఇమామ్ దవడకు గాయమవడంతో సబ్‌స్టిట్యూట్‌గా ఉస్మాన్ వచ్చారు. దీంతో ముఖీమ్ మరోసారి 12వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు.
News April 6, 2025
కనులపండువగా ఎదుర్కోలు వేడుక (PHOTOS)

TG: రేపు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఇవాళ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఉదయం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండటంతో 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.