News May 2, 2024
కాంగ్రెస్, BRS పార్టీలు ప్రభుత్వాన్ని మా చేతిలో పెడతాయి: మోదీ
కేంద్రంలో సంకీర్ణం వస్తుందని KCR చేస్తోన్న వ్యాఖ్యలపై PM మోదీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆయన ఎప్పుడూ ఇలాంటి అబద్ధాలే చెబుతారు. GHMC ఎన్నికలయ్యాక KCR నా దగ్గరికి వచ్చారు. NDAలో చేరతా అన్నారు. కానీ మేం విపక్షంలోనే ఉండి పోరాడతాం అని చెప్పా. ఇప్పుడు కాంగ్రెస్-BRS చెరోవైపు బండి(ప్రభుత్వం)ని లాగుతున్నాయి. త్వరలో దాన్ని బీజేపీ చేతిలో పెట్టి వెళ్లిపోతాయి. చూస్తూ ఉండండి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 26, 2024
పెళ్లంటే భయం.. రొమాన్స్ అంటే ఇష్టం: శృతి హాసన్
తన వివాహం గురించి హీరోయిన్ శృతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ సూచించారు. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రిలేషన్లో ఉండేందుకు ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
News December 26, 2024
పిల్లలకు చదువుతోపాటు వీటిని నేర్పిస్తున్నారా?
పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఐదు ఆధ్యాత్మిక అంశాలు నేర్పాలి. పిల్లలను కృతజ్ఞతాభావంతో పెంచాలి. ఎవరైనా సాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పించాలి. చిన్నతనం నుంచే మనుషులు, మొక్కలు, జంతువులపై దయ ఉండేలా మలచాలి. చిన్నారుల్లో పరధ్యానం పోగొట్టడానికి ఏకాగ్రత అలవర్చాలి. క్షమాగుణం కూడా అలవాటు చేయాలి. ఎవరైనా తప్పు చేసినా పగ తీర్చుకోకుండా క్షమించడాన్ని నేర్పాలి. ఆధ్యాత్మికతపై వారిలో ఆసక్తిని పెంచాలి.
News December 26, 2024
మస్కట్ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్
AP: మస్కట్లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.