News November 28, 2024

కాంగ్రెస్, BRS ఒకటే: బండి సంజయ్

image

TG: బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తున్నారన్న KTR వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. ‘BJP, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు. మోదీ నాయకత్వంలో మా పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తుండటాన్ని KTR జీర్ణించుకోలేకపోతున్నారు. BRS హయాంలో జరిగిన స్కామ్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, BRS ఒకటే అనడానికి ఇదే నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 20, 2026

మన ఆయుష్షు తగ్గించే కొన్ని అపవిత్ర పనులు

image

కొన్ని అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. దాని ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకపోతే స్వచ్ఛమైన గాలి అందక అనారోగ్యం కలుగుతుంది. రాత్రిపూట పెరుగు, దాంతో చేసినవి తింటే వ్యాధులు రావొచ్చు. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించడం, శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే విష వాయువు పీల్చడం హానికరం. స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల చెడు ఆలోచనలు ఉంటే ఆయుష్షు క్షీణిస్తుంది.

News January 20, 2026

హ్యాట్సాఫ్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు

image

AP: నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. దాదాపు రూ.2కోట్ల విలువజేసే ఆస్తి ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి రాసిచ్చేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News January 20, 2026

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ఆదేశాలు

image

TG గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 JAN 1 నుంచి DEC 31 మధ్య CBFC ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. కొత్తగా ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా.సి.నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నారు. ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.