News February 2, 2025
ట్యాంక్ బండ్పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన
HYD ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నదైన రాష్ట్రానికి సరిగ్గా నిధుల కేటాయింపు జరగలేదని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Similar News
News February 2, 2025
భారత్ భారీ స్కోరు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్(135) సెంచరీతో చెలరేగారు. అభి తన ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదారు. అతని హిట్టింగ్కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ టార్గెట్ 248.
News February 2, 2025
రికార్డులతో ‘అభి’షేకం
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్గానూ నిలిచారు.
News February 2, 2025
వారిద్దరు రాజీనామా చేయాలి: టీపీసీసీ చీఫ్
TG: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో తమతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు.