News March 27, 2024
కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ సీఈసీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఇందులో చర్చించనున్నారు. భేటీ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
Similar News
News March 18, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 18, 2026
ఇదేంటి భయ్యా.. రోజూ రేట్ పెంచుతున్నారు?

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న, జాబ్ చేస్తూ రూముల్లో ఉంటున్న బ్యాచిలర్లు అంటున్న మాటలివి. LPG కొరతతో పలు హోటళ్లు క్లోజింగ్ బోర్డులు పెట్టగా.. మరికొన్ని టిఫిన్లు, కర్రీలపై 2-3 రోజులకు రూ.5 పెరుగుతోందని వాపోతున్నారు. గ్యాస్ కొరత నిజమే అయినా రోజూ దాన్ని సాకుగా చూపుతూ ధరలు పెంచడం కరెక్ట్ కాదంటున్నారు. గత 10 రోజుల్లో వీటిపై రూ.15 వరకు పెంచినట్లు చెబుతున్నారు. మీ ఏరియాలో ఎలా ఉంది?
News March 18, 2026
నేడు అకౌంట్లలోకి డబ్బులు

AP: పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో నేడు ప్రభుత్వం రూ.250 కోట్లు జమ చేయనుంది. ఉగాది కానుకగా CM చంద్రబాబు ఇవాళ కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నారు. వీరికి గతేడాది సంక్రాంతికి రూ.980 కోట్లు, దీపావళికి రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016లో తాము రూ.700 కోట్లు ఇవ్వగా.. YCP హయాంలో ఒక్క రూపాయీ చెల్లించలేదని ఆరోపిస్తోంది.


