News November 10, 2024
బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం: KTR

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని KTR డిమాండ్ చేశారు. అది కాంగ్రెస్ ఎన్నికల హామీ అని, దాన్ని నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం ఎత్తుకుందని విమర్శించారు. బ్యాంకుల్లో డబ్బెంత ఉంది? ఏసీ ఉందా? ఫ్రిజ్ ఉందా? టీవీ ఉందా? అని అడగడమేంటని ప్రశ్నించారు. కులగణన అంటున్నారు కానీ రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదని మండిపడ్డారు.
Similar News
News January 18, 2026
‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్ వెల్లడించింది.
News January 18, 2026
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

అత్యధిక వేదికల్లో సెంచరీలు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 35 వేదికల్లో శతకాలు నమోదు చేసి సచిన్(34) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(26), పాంటింగ్(21) ఉన్నారు. మరోవైపు NZపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గానూ రికార్డులకెక్కారు. కోహ్లీ(10) తర్వాతి స్థానాల్లో కలిస్(9), రూట్(9), సచిన్(9), పాంటింగ్(8), సెహ్వాగ్(8) ఉన్నారు.
News January 18, 2026
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


