News November 11, 2024

BJP వీడియోలపై ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

BJP ప్రకటనలపై ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. JMM, INC, RJD నేతలను నెగటివ్‌గా చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారని పేర్కొంది. BJP4Jharkhand సోషల్ మీడియా అకౌంట్లలో వీటిని పోస్ట్ చేశారని తెలిపింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే అని వెల్లడించింది. ఝార్ఖండ్‌లో ఆదివాసీలకు తాము వ్యతిరేకమని, BJP వాళ్లు అనుకూలమన్నట్టుగా బ్రాండింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ఫిర్యాదు వివరాలను జైరామ్ రమేశ్ Xలో షేర్ చేశారు.

Similar News

News January 7, 2026

‘జన నాయకుడు’ విడుదలపై వీడని ఉత్కంఠ

image

విజయ్ ‘జన నాయకుడు’ సినిమా విడుదలకు గండం తప్పేలా లేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా తీర్పు రిజర్వ్ చేసింది. ఈనెల 9న సినిమా విడుదల కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్పే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. దీంతో సినిమా విడుదల టెక్నికల్‌గా వాయిదా పడినట్టేనని తెలుస్తోంది.

News January 7, 2026

అబార్షన్ అయిందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావొచ్చు. దీని తర్వాత ఆ మహిళ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. రెండు వారాలకు మీరు మామూలుగా ఇంటి పనులు, వ్యాయామం, యోగా మొదలుపెట్టవచ్చు. అయితే అబార్షన్ తర్వాత నెలసరి అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. 3నెలలపాటు మల్టీవిటమిన్‌ మాత్రలు తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకున్న తరువాతే ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి.

News January 7, 2026

NPCILలో 114 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) 114 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్, X-RAY టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు JAN 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.npcilcareers.co.in