News March 9, 2025

CPIకి MLC టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ సమాలోచనలు!

image

TG: MLA కోటా MLC అభ్యర్థులపై CM రేవంత్ సహా ముఖ్య నేతలు ఇవాళ AICC పెద్దలతో ఫోన్‌లో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఆ పార్టీకున్న బలాన్ని బట్టి 4 పదవులు దక్కొచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమకో సీటు ఇవ్వాలని CPI పట్టుబడుతోంది. INCలోనే పోటీ తీవ్రంగా ఉండటంతో CPIకి ఇప్పుడే ఇవ్వాలా? లేక గవర్నర్ కోటాలో ఇద్దామా? అని ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై రాత్రిలోపు క్లారిటీ రానుంది.

Similar News

News December 8, 2025

వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

image

TG: 2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తోంది’ అని చెప్పారు.

News December 8, 2025

చెన్నై టు రష్యా.. నూతన సరకు రవాణా మార్గం

image

భారత్-రష్యా మధ్య సరకుల రవాణా సమయం రానున్న కాలంలో సగం వరకు తగ్గనుంది. ప్రస్తుతం రష్యాకు నౌకల ద్వారా సరకుల రవాణాకు 40 రోజుల సమయం పడుతోంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చెన్నై-వ్లాడివోస్టాక్ మధ్య తూర్పు కారిడార్ ఏర్పాటుపై చర్చించారు. ఇది కార్యరూపం దాల్చితే 5,700 కి.మీ దూరం తగ్గి 24 రోజుల్లోనే రష్యాకు సరకులు చేరతాయి. కాగా ప్రపంచ ఉద్రిక్తల నేపథ్యంలో ఇది సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు.

News December 8, 2025

రేపు సాయంత్రం నుంచి వైన్స్ బంద్

image

TG: ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా తొలి విడత ఎన్నికలు ఈ నెల 11న 4,236 స్థానాల్లో జరగనున్నాయి.