News January 16, 2025
కి.మీ.కు రూ.3.91 కోట్లు.. సైకిల్ ట్రాక్ పగుళ్లపై కాంగ్రెస్ విమర్శలు
హైదరాబాద్‌లోని సైకిల్ ట్రాక్‌పై పగుళ్లు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు గత BRS సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘కాళేశ్వరం, సుంకిశాల.. ఇప్పుడు సైకిల్ ట్రాక్. కేటీఆర్ కట్టించిన సైకిల్ ట్రాక్ పరిస్థితి ఇది’ అని పగుళ్లు వచ్చిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్ గూడ నుంచి ORR ఇంటర్‌ఛేంజ్ వరకు రెండు వైపులా 23 కి.మీ మేర ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. కి.మీకు రూ.3.91 కోట్ల మేర ఖర్చయింది.
Similar News
News January 16, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్ వచ్చింది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఏప్రిల్ నెల అకామొడేషన్ కోటా బుకింగ్స్ కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2025
సంక్రాంతి సీజన్లో తొలిసారి.. అన్నీ రూ.100 కోట్ల క్లబ్‌లోనే!
సంక్రాంతి బరిలో నిలిచే అన్ని సినిమాలు హిట్ అవ్వవు. అలాగే కలెక్షన్లూ రాబట్టలేవు. కానీ, ఈ ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలు ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లో చేరగా నేడు వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఆ మార్క్ దాటనుంది. ఇలా సంక్రాంతి సీజన్లో అన్ని మూవీస్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం మొదటిసారి కానుందని సినీవర్గాలు తెలిపాయి.
News January 16, 2025
BREAKING: సముద్రంలో మునిగి ముగ్గురు మృతి
AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోగా, ఒకరిని జాలర్లు కాపాడారు. మరో వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. మృతులను పొన్నలూరు మండలం తిమ్మపాలెం వాసులుగా గుర్తించారు. డెడ్ బాడీలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.