News September 13, 2025
మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.
Similar News
News March 13, 2026
కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

దేశంలో <<19323083>>కల్తీ పాల<<>> ఘటనలు వెలుగు చూస్తుండటంతో FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదారులు, విక్రయదారులు కచ్చితంగా రిజిస్ట్రేషన్/లైసెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని సూచించింది. సర్టిఫికెట్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.
News March 13, 2026
అమెరికాకు చిల్లు.. రష్యాకు కాసుల పంట

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా జేబుకు చిల్లు పడితే రష్యా మాత్రం దీనిని క్యాష్ చేసుకుంటోంది. చమురుకు డిమాండ్ పెరగడంతో ఆదాయంలో ఆ దేశానికి రోజుకు అదనంగా 150 మిలియన్ డాలర్లు (₹1,300 కోట్లు) వస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరుకు ఈ సంక్షోభం వల్ల రష్యాకు అదనంగా $5 బిలియన్లు (₹46వేల కోట్లు) రెవెన్యూ వస్తుందని అంచనా. మరోవైపు US ఇరాన్‌పై భారీగా ఖర్చు చేస్తోంది. వారంలోనే 6 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది.
News March 13, 2026
పౌల్ట్రీ పరిశ్రమపై వార్ ఎఫెక్ట్.. గుడ్ల ధర పతనం

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశీయ పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పోర్టుల నుంచి కోడి గుడ్ల లోడ్ వెనక్కి రావడంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధానికి ముందు ఒక కోడి గుడ్డు ధర రూ.7 వరకూ ఉండగా.. ప్రస్తుతం అది కొన్నిచోట్ల రూ.4, రూ.3.50కు పడిపోయింది.


