News December 24, 2024

NHRC ఛైర్‌పర్సన్ ఎంపికపై కాంగ్రెస్ విమర్శలు

image

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) ఛైర్ పర్స‌న్‌గా సుప్రీం మాజీ జడ్జి సుబ్రమణియన్‌ను నియమించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిన నియామకం కాదన్నారు. ఆయన్ను నియమించిన విధానం సరిగాలేదని, నియామకానికి ఉద్దేశించిన కమిటీ నిబంధనలను తుంగలో తొక్కిందన్నారు. తాము సూచించిన జడ్జిలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు.

Similar News

News January 25, 2026

తెలుగు రాష్ట్రాల్లో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు ఘటనల్లో ఐదుగురు మరణించారు. నాగర్ కర్నూల్(D) ముచ్చర్లపల్లిలో నీటి గుంతలో పడి సిరి(14), శ్రీమన్యు(14), స్నేహ(15) అనే ముగ్గురు విద్యార్థులు మరణించారు. గుంతలో పడిన ఒకరిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారు. APలోని నెల్లూరు(D) తూర్పు రొంపిదొడ్లలో ఇద్దరు యువకులు గణేశ్ (16), రమేశ్ (15) బైక్‌పై వెళ్తుండగా కందిచేను చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సజీవదహనమయ్యారు.

News January 25, 2026

రిపబ్లిక్ డే.. 30వేల మంది పోలీసులు, 6 కంట్రోల్ రూమ్స్‌తో నిఘా

image

ఢిల్లీలో రేపు జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలు పాల్గొంటున్నాయి. కర్తవ్యపథ్ వద్ద 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నిఘా చర్యలు చేపట్టారు. 10 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు పరేడ్‌కు హాజరవుతున్నారు. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు పరేడ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈసారి చోటు దక్కలేదు.

News January 25, 2026

టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి

image

TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టెండర్లలో స్కామ్ జరిగితే ఉపేక్షించబోమన్నారు. ‘కిషన్ రెడ్డి లేఖ రాస్తే దగ్గరుండి విచారణ చేయిస్తా. నా సోదరుల కంపెనీలతో నాకు సంబంధం లేదు. నాకు ఏ కంపెనీలో వాటా లేదు. డబ్బులే కావాలనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతా?. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే BRS దుష్ప్రచారం చేస్తోంది’ అని ఫైరయ్యారు.