News January 5, 2025
నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్: హరీశ్ రావు

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. రైతుభరోసా ఒక విడతలో ఎకరానికి రూ.7,500 ఇస్తామని, ఇప్పుడు రూ.6,000కు కుదించడం దారుణమన్నారు. ‘రైతుభరోసాను రైతు గుండెకోతగా మార్చారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ఠ. దారుణంగా దగా చేసిన సర్కార్కు ప్రజలే బుద్ధి చెప్తారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుభరోసా కూడా చెల్లించాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.
Similar News
News November 7, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఆచార్య NG రంగా 125వ జయంత్యుత్సవాలకు హాజరుకానున్న CM చంద్రబాబు
* వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రధాని పిలుపు మేరకు ఉ.9.50 గం.కు ప్రతి ఒక్కరం గేయాన్ని ఆలపిద్దాం: పవన్
* HYDలో జన్మించిన గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్ కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం: CM చంద్రబాబు
* పోలవరం ప్రాజెక్ట్పై ఆ ప్రాజెక్ట్ అథారిటీ రెండ్రోజుల సమీక్ష. నేడు HYDలోని కార్యాలయంలో, రేపు ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన
News November 7, 2025
APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

చెన్నై ఆవడిలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<
News November 7, 2025
రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.


