News May 4, 2024
వొక్కలిగ ఓట్ల కోసమే ‘ప్రజ్వల్’పై కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదు: నిర్మల

కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఏడాదిగా కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వొక్కలిగ ఓట్ల కోసమే ఈ పని చేసింది. ఇప్పుడు లోక్‌సభ తొలి దశ పోలింగ్ ముగిసే వరకు మౌనంగా ఉంది’ అని ఆరోపించారు. JDSతో పొత్తు ఉన్నప్పటికీ మహిళలపై అరాచకాలను సహించబోమని స్పష్టం చేశారు.
Similar News
News December 27, 2025
AIIMS రాయపుర్లో 100 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు

<
News December 27, 2025
వరుసగా 5 సెంచరీలతో రికార్డు

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ ధ్రువ్ షోరే రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌తో రాజ్‌కోట్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో అజేయంగా 109 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో లిస్ట్-A క్రికెట్లో వరుసగా 5 సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా తమిళనాడు ప్లేయర్ జగదీశన్ రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్‌లో విదర్భ 365 రన్స్ చేయగా, హైదరాబాద్ 276కే పరిమితమైంది.
News December 27, 2025
10 రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం: TTD EO

AP: వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించామని వివరించారు.


