News April 9, 2024

ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి కొత్త పేరు!

image

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించగా పార్టీ అధిష్ఠానం తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మాజీ ఎంపీ సురేంద్రరెడ్డి తనయుడు రఘురామిరెడ్డికి సీటు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.

Similar News

News January 12, 2025

కేటీఆర్‌ను నేనేం పొగడలేదు: దానం

image

TG: <<15124836>>తాను కేటీఆర్‌ను పొగిడానంటూ<<>> వచ్చిన వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ‘హైదరాబాద్ ఇమేజ్‌ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్, కేటీఆర్ నగరానికి చేసిందేం లేదు. హైడ్రా విషయంలో నా మాట మీదే ఉన్నా. దాని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ఫార్ములా-ఈ కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అలా అని నేను కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెటేం ఇవ్వడం లేదు’ అని తెలిపారు.

News January 12, 2025

LOS ANGELES: కార్చిచ్చు ఆర్పేందుకు నీళ్లూ కరవు..!

image

లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు మరింత ఉద్ధృతమవుతోంది. నగరం వైపుగా భీకర గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వ్యాపిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధికారులు ట్యాంకర్లతో నీటిని తరలించి మంటలు అదుపు చేస్తున్నారు. కాగా కొందరు హాలీవుడ్ స్టార్లు వారికి కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వాడుకుని గార్డెన్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

News January 12, 2025

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

image

TG: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.