News August 26, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. 30న సభ

TG: ఈనెల 30న జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. దీనికి CM రేవంత్ సహా మహేశ్ కుమార్, మీనాక్షీ నటరాజన్ హాజరవుతారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళే మీటింగ్ ఉండాల్సింది. కానీ రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు CM బిహార్ వెళ్తున్నారు. దీంతో సభ తేదీని మార్చారు. ఇక రాహుల్‌కు సంఘీభావంగా ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ నినాదంతో ఈ సభను నిర్వహిస్తున్నామని PCC చెప్పినా త్వరలో జరగబోయే ఉపఎన్నికే టార్గెట్ అని తెలుస్తోంది.
Similar News
News August 26, 2025
పెరిగిన గోల్డ్ రేట్స్

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.1,02,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 ఎగబాకి రూ.93,550 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,30,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 26, 2025
టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్స్

భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి 50% టారిఫ్స్ అమల్లోకి రానుండటం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 574 పాయింట్ల నష్టంతో 81,061, నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,793 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, HUL, హీరో మోటోకార్ప్, TCS లాభాల్లో ఉండగా టాటా స్టీల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రిక్, ICICI బ్యాంక్, Airtel నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News August 26, 2025
BCCI స్పాన్సర్‌గా TOYOTA?

టీమ్ఇండియా స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను BCCI తప్పించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు జపాన్ ఆటోమేకర్ టయోటా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ కూడా స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు BCCI అధికారిక బిడ్డింగ్ మొదలుపెట్టలేదు. అటు SEP 9న మొదలయ్యే ఆసియా కప్‌లోపు స్పాన్సర్ దొరకడం దాదాపు కష్టమే.