News March 13, 2025

మా వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: సీఎం

image

AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.

Similar News

News March 13, 2025

2లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

image

AP: ఏఐ, డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏటా 2లక్షలమందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో APSSD ఒప్పందం చేసుకొంది. 50 ఇంజినీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ, 10వేల మంది విద్యార్థులకు ఏఐ , క్లౌడ్ కంప్యూటరింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వనుంది. అదే విధంగా 30 ఐటీఐల్లో 30వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

News March 13, 2025

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

News March 13, 2025

జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలంటూ అసెంబ్లీలో ప్రతిపాదన

image

TG: స్పీకర్‌పై <<15744584>>వ్యాఖ్యలు<<>> చేసిన జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రతిపాదన ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరుగుతోంది. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్‌పై వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్నారు. లోక్‌సభలో ప్రవర్తన నియమావళి కింద టీఎంసీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు.

error: Content is protected !!