News September 12, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది: కేటీఆర్

TG: రుణమాఫీ కాలేదని, పెట్టుబడి సాయం అందలేదని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని KTR అన్నారు. ‘KCR రైతును రాజును చేస్తే, కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా బోగస్. రుణమాఫీలో పావు శాతం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. రైతన్నలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. ఢిల్లీ యాత్రలు చేయటం కాదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 21, 2025
శివ పూజ ఇలా చేస్తే.. అన్ని శుభాలే!

రోజుకు 3 సార్లు చేసే పూజలను త్రికాలార్చనలు అని అంటారు. వాటిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చేస్తారు. ఉదయం చేసే పూజలు నిత్య కర్మలకు అనువైనవి. మధ్యాహ్నం చేసేవి కామ్య కర్మలకు (కోరికలు తీరడం కోసం) తగిన సమయం. సాయంత్ర పూజలు శాంతి కర్మలకు (దోషాలు తొలగిపోవడం కోసం) మంచివి. రాత్రి మధ్య భాగమైన నిశీధ సమయంలో చేసే శివపూజకు గొప్ప ఫలం ఉంటుంది. ఇలాంటి కర్మల ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని నమ్మకం. <<-se>>#SIVOHAM<<>>
News October 21, 2025
సలాం పోలీస్

భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న పంజాబ్ DSP కరమ్ సింగ్ నేతృత్వంలోని CRPF బృందం గస్తీ కాస్తోంది. అదే సమయంలో సియాచిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూ చైనా దాడులకు దిగింది. వీరిని ఎదుర్కొంటూ చేసిన పోరాటంలో 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. వారి సేవలను స్మరిస్తూ అప్పటి నుంచి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
News October 21, 2025
‘శుక్లాంబరధరం విష్ణుం’ అర్థమిదే..

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే!!
తెల్లని వస్త్రాలను ధరించినట్టి, విష్ణువు వలె జగమెల్లను వ్యాపించినట్టి, చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతిని కలిగినట్టి, నాలుగు చేతులు కలిగినట్టి, శాంతిగల ముఖమును కలిగినట్టి గణపతిని సకల విఘ్నములను నివారించుటకై ధ్యానించవలెను.