News March 18, 2025
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదు: KTR

TG: డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. ‘దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది మా పార్టీనే. డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై పోరాడుతాం. ఈనెల 22న చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరై, మా పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తా’ అని తెలిపారు.
Similar News
News March 18, 2025
యాదగిరి గుట్టకు పాలకమండలి: మంత్రి కొండా సురేఖ

TG: టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆలయానికి పాలకమండలి బోర్డు ఉండేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే బోర్డు స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 60కిలోల బంగారం నిల్వలు ఉన్నాయని, అదే విధంగా రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్నపసిడి నిల్వల సమాచారం తెప్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
News March 18, 2025
EPF నగదు విత్‌డ్రా మూడు రోజుల్లోనే..!

EPFలో క్లైయిమ్‌లు ఆటోమోడ్‌లో 3రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 2కోట్లకు పైగా క్లెయిమ్‌లు ఆటోమోడ్‌లోనే జరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమన్నారు. విత్ డ్రా పరిమితి రూ. లక్ష రూపాయలకి పెంచినట్లు పేర్కొన్నారు. త్వరలో EPFనగదు UPIద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం వచ్చే అవకాశం ఉంది.
News March 18, 2025
రచయిత మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రాజమౌళి

మలయాళ రచయిత గోపాలకృష్ణన్ మృతిపై దర్శకుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త బాధించిందని ఆత్మకు శాంతికలగాలని Xలో ఫోస్ట్ చేశారు. ‘ఈగ’ ‘బాహుబలి’ ‘RRR’ చిత్రాల మలయాళ వెర్షన్‌కు గోపాలకృష్ణ పనిచేశారు.