News June 14, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘ప్రభుత్వం ఏర్పాటై 191 రోజులు గడిచినా హామీల అమలు కాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే AP సీఎం అన్ని రకాల పింఛన్లు పెంచారు. ఒడిశాలో వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3100 చేశారు. ఇక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 6 గ్యారంటీలు, 13 హామీలను వెంటనే అమలు చేయాలి’ అని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Similar News
News December 8, 2025
విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారా?

శ్రీవారితో పాటు ఆలయ గోపురంపై ఉన్న విమాన వేంకటేశ్వరుడికీ అంతే ప్రత్యేకత ఉంటుందని చాలామంది భక్తులకు తెలిసుండదు. తిరుమలకు వెళ్లినవారు ఇరువురినీ తప్పక దర్శించుకోవాలని <<18475056>>పురోహితులు<<>> సూచిస్తున్నారు. ఆనంద నిలయంపై వాయవ్య మూలన వెండి మకర తోరణంతో ఉన్న మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విమాన వేంకటేశ్వరుడి విగ్రహం ఉంటుంది. 16వ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ విగ్రహం వద్ద ధ్యానం చేసి మోక్షం పొందారని ప్రతీతి.
News December 8, 2025
వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

TG: 2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తోంది’ అని చెప్పారు.
News December 8, 2025
చెన్నై టు రష్యా.. నూతన సరకు రవాణా మార్గం

భారత్-రష్యా మధ్య సరకుల రవాణా సమయం రానున్న కాలంలో సగం వరకు తగ్గనుంది. ప్రస్తుతం రష్యాకు నౌకల ద్వారా సరకుల రవాణాకు 40 రోజుల సమయం పడుతోంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చెన్నై-వ్లాడివోస్టాక్ మధ్య తూర్పు కారిడార్ ఏర్పాటుపై చర్చించారు. ఇది కార్యరూపం దాల్చితే 5,700 కి.మీ దూరం తగ్గి 24 రోజుల్లోనే రష్యాకు సరకులు చేరతాయి. కాగా ప్రపంచ ఉద్రిక్తల నేపథ్యంలో ఇది సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు.


