News May 10, 2024
ఎన్నికలు పూర్తవగానే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది: అర్వింద్

TG: లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే పడేసుకుంటారు. ఉత్తమ్, కోమటిరెడ్డి తలచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. నెల రోజుల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది. వారి పార్టీ పతనావస్థకు చేరింది’ అని వేల్పూరు రోడ్ షోలో ప్రసంగించారు.
Similar News
News March 15, 2026
నెతన్యాహును వేటాడి మరీ చంపేస్తాం: IRGC

నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని IRGC హెచ్చరించింది. మరోవైపు నెతన్యాహు చేతికి ఆరువేళ్లు ఉన్నాయని.. అది <<19382555>>AI వీడియో<<>> అని ఇరాన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది AI వీడియో కాదని, లైటింగ్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడి అలా ఒక వేలు ఎక్స్‌ట్రా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.
News March 15, 2026
బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్ (లేదా) 2mlహెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
News March 15, 2026
చిన్నచిన్న ధర్మాలతో పాపాలెలా పోతాయి?

జనకుడితో వశిష్ఠ మహర్షి ఇలా వివరించారు.. ‘అడవిలో ఎండుగడ్డి వాము ఎంత పెద్దదైనా చిన్న నిప్పు రవ్వ దాన్ని క్షణంలో బూడిద చేస్తుంది. అలాగే యుగయుగాల పాపలు ధర్మాలనే చిన్న పుణ్య కార్యాల ముందు నిలవలేదు. భక్తితో చేసే నదీ స్నానం, దీపారాధన పాపాలను దహించివేస్తాయి. ‘నారాయణ’ అనే నామానికి ఉన్న శక్తి అపారమైనది. ఆ నామ ఉచ్ఛారణతో యమభటులే వణికిపోతారు. భగవంతుని కృపకు ఆడంబరమైన యజ్ఞాల కంటే ధర్మం మిన్న అని గ్రహించు’.


