News November 27, 2024
కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది: బండి సంజయ్
TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా విద్యార్థులకు పెట్టే ఆహారం మారలేదని విమర్శించారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్నారు. ‘పిల్లలకు సురక్షిత భోజనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి ప్రాథమిక బాధ్యతను కూడా నిర్వర్తించలేని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుంది?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 27, 2024
అభివృద్ధిని ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు: భట్టి
TG: మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికే రూ.10 వేల కోట్ల కేటాయించామని, అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కాకుల్లా అరుస్తున్నారని మండిపడ్డారు. పనిలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదన్నారు. మూసీ నిర్వాసితులకు వ్యాపార రుణాలు ఇస్తామని చిట్‌చాట్‌లో వెల్లడించారు.
News November 27, 2024
కారు కొంటున్నారా? ఈ విషయం తెలుసా?
ఇండియాలో కార్ల ధరలో సగం పన్నులే అని మీకు తెలుసా? GST 28%, సెస్ 17% ఎక్స్-షోరూం ధరలో కలిసి ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ 15-20%, ఇన్సూరెన్స్‌పై 18% జీఎస్టీ విధిస్తారు. కారు రేటు రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అదనంగా 1% TCS ఉంటుంది. ఉదాహరణకు ఓ కారు ఎక్స్-షోరూం ధర రూ.10 లక్షలు ఉంటే అందులో రూ.3.11 లక్షలు పన్నులే (28% జీఎస్టీ+17% సెస్) ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ కింద రూ.2 లక్షలు చెల్లించాలి.
News November 27, 2024
BJP ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్
AP: ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్పిస్తే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి’ అని ఆయన ఆదేశించారు.