News February 8, 2025
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్ రావు

TG: మొన్న హరియాణా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ పాత్ర అమోఘం అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందన్నారు. తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణన మళ్లీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలన్నారు. లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Similar News
News January 11, 2026
విడాకుల వెనక చీకటి కోణం.. మౌనం వీడిన మేరీ కోమ్!

బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ తన విడాకుల వెనుక ఉన్న కారణాలను బయటపెట్టారు. తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను భర్త ఓన్లర్ తన పేరు మీదకు మార్చుకున్నారని, భారీగా అప్పులు చేసి తనను దాదాపు దివాలా తీయించారని ఆరోపించారు. 2022లో గాయపడి మంచంపై ఉన్నప్పుడు ఈ నిజాలు తెలిసి షాక్ అయ్యానన్నారు. తన వ్యక్తిత్వంపై SMలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్లే ఇప్పుడు మౌనం వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
News January 11, 2026
న్యాయం గొప్పదా? ధర్మం గొప్పదా?

సమాజానికి రెండూ అవసరమే. కానీ, న్యాయం కన్నా ధర్మమే గొప్పది, విస్తృతమైనది. ఇది మన అంతరాత్మ, నైతికతకు సంబంధించినది. ఓ వ్యక్తి తన బాధ్యత, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించడమే ధర్మం. ఇదే శాశ్వత సత్యం. న్యాయం కేవలం చట్టబద్ధమైనది. సాక్ష్యాధారాల ఆధారంగా, క్రమశిక్షణ కోసం మనం ఏర్పరుచుకున్నది. న్యాయం పరిస్థితులను బట్టి మారవచ్చు. కానీ ధర్మం అలా కాదు. ఇది మానవత్వాన్ని కాపాడుతుంది. అందుకే ధర్మమే గొప్పది.
News January 11, 2026
డీ హైడ్రేషన్ ఉంటే ఏమవుతుందంటే?

డీహైడ్రేషన్ ఊబకాయానికి దారితీస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీని వల్ల తలనొప్పి, భారంగా అనిపిస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల మూత్రం చిక్కగా మారుతుంది. బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో నీరు లేకపోవడం రక్త ప్రసరణ ప్రభావితం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి బలహీనత కలుగుతుంది. ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా వస్తాయి.


